బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మరణించింది. మాగడి తాలూకా బ్యాడరహళ్లికి చెందిన ధనుశ్రీ (20) మంగళూరులోని ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. జాతర చూసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో షాపింగ్ చేసేందుకు తమ్ముడితో కలిసి బైక్‌పై బయటికి వెళ్లింది. అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడగా వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం ఆమె పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది.