ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజుస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ఖర్చులను తగ్గించే ప్రక్రియలో భాగంగా దాదాపు 120 ట్యూషన్ సెంటర్‌లను మూసివేయనున్నట్టు సమాచారం. బైజుస్‌కి మొత్తం 250 వరకు ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం మూతపడనున్నాయి. ఈ మేరకు కంపెనీ ఇప్పటికే సెంటర్‌ల లీజు ఒప్పందాలను ముగించాలని తన ట్యూషన్ సెంటర్‌ల నిర్వాహకులకు నోటీసులు పంపడం ప్రారంభించింది.