బంగ్లాదేశ్ సంక్షోభం.. నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు

82చూసినవారు
బంగ్లాదేశ్ సంక్షోభం.. నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు
బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకొని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దేశంలో జరిగిన హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్