TG: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడంతో పాటు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 56 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ అని చెబుతూ తప్పించుకుంటున్నారని విమర్శించారు.