క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్

79చూసినవారు
క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్
గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు తలో 25 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే అదనపు వేదికల్లోని (ధర్మశాల, వైజాగ్, గువాహటి) గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు కూడా తలో రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ విజయవంతంగా ముగిసేందుకు వీరు కీలకపాత్ర పోషించడంతో నజరానా ప్రకటించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్