ఐపీఎల్లో రికార్డులు అంటే గుర్తొచ్చే తొలి పేరు విరాట్ కోహ్లి. RCB తరపున 252 మ్యాచ్‌లు ఆడి 8,004 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పట్లో కొట్టే ప్లేయర్ దరిదాపుల్లో ఎవరూ లేరు. టాప్- 10 జాబితాలో రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్ (6769) దాదాపు ఐపీఎల్ కి దూరమైనట్లే. కాబట్టి అతడికి ఆ అవకాశం లేదు. ఆ తర్వాత రోహిత్ శర్మ (6628) ఉన్నా వరుస సీజన్లలో భారీ పరుగులు చేయాలి. కాబట్టి ఈ రికార్డును ఇప్పట్లో కొట్టేవాళ్లే లేరు.