నిరుద్యోగులు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన పథకం 'రాజీవ్ యువ వికాసం' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నిరుద్యోగుల గురించి ఆలోచించింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాలేదని.. చెప్పిన విధంగానే పథకాన్ని కార్యాచరణ రూపంలో తీసుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు.