తెలంగాణలోని సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలన్నారు. HYD- జూబ్లీ హిల్స్ నివాసంలో భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 'భూ భారతి' సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను పరిష్కరించేలా రూపొందించాలన్నారు.