ప్రతీకార దాడులపై బైడెన్ స్పంద‌న‌

75చూసినవారు
ప్రతీకార దాడులపై బైడెన్ స్పంద‌న‌
ఇటీవల జోర్డాన్‌లో అమెరికా సైనిక క్యాంప్‌పై జరిగిన డ్రోన్‌ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడులపై తాజాగా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, కానీ అమెరికన్లకు హాని కలిగిస్తే మాత్రం ప్రతిచర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్