BIG ALERT: ఈ ట్యాబ్లెట్లు వాడొద్దు

142160చూసినవారు
BIG ALERT: ఈ ట్యాబ్లెట్లు వాడొద్దు
ఏపీ, తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా 'Meg Lifesciences' పేరిట అమ్ముతున్న మందులు నకిలీవని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది. ఆ ట్యాబ్లెట్ ల పంపిణిని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ట్యాబ్లెట్ లలో అసలు మెడిసినే లేదని, చాక్ పౌడర్, గంజితో తయారుచేస్తున్నట్లు తేల్చింది. వీటిని వాడితే హై రిస్క్ ఉంటుందని, మార్కెట్ లో Meg Lifesciences పేరిట విక్రయించే మందులను కొనొద్దని, ఎవరైనా ఇప్పటికే కొనుగోలు చేస్తే వాడొద్దని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్