AP: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని ఇటీవల అరెస్టు చేసేందుకు సిద్ధం కాగా, ఆర్జీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే.