మహానగరాల నుంచి మారుమూల పల్లెల వరకు విస్తరించిన బెట్టింగ్ మాఫియాను కూకటివేళ్లతో పెకలించేందుకు పాలకులు పటిష్ఠ చట్టాన్ని రూపొందించాలి. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచనే అనర్థదాయకమైనదని యువత గుర్తించాలి. బెట్టింగ్‌ల్లో నష్టాలే తప్ప లాభాలుండవు. డబ్బులు అయాచితంగా రావు... వచ్చినా నిలబడవు. జూదానికి ఎంత దూరంగా ఉంటే.. అంత ఆనందంగా జీవనం సాగిపోతుంది. వ్యసనాల మూలంగా పోయేది మనశ్శాంతి మాత్రమే కాదు, ప్రాణాలు కూడా.