రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో పర్యటించిన ఆయన మిర్చి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు కల్పించడం లేదని మండిపట్టారు. తమ హయాంలో మిర్చి క్వింటాకు రూ. 21 వేల నుంచి రూ. 27 వేల దాకా ఇచ్చామని టీడీపీ హయాంలో రూ.11వేలు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.