మహారాష్ట్రలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న SUV కారు ప్రమావదశాత్తు బైకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 29 ఏళ్ళ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు కారు వదిలి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.