అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో నిత్యం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో నోయిడాలోని సెక్టార్ 45 ప్రాంతంలో ఇరుకైన సందులో ఇటీవల ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకెళ్లాడు. అక్కడ ఆడుకుంటున్న బాలుడిని రెప్పపాటు వేగంతో ఢీకొట్టి పరారయ్యాడు. కింద పడిన బాలుడు ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్లిపోయాడు. బాలుడు గాయాలతో తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.