TG: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మహంకాళీ ఆలయం వద్ద ఓ ఇంట్లో గ్యాస్ రెఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.