మధ్యప్రదేశ్ విదిష జిల్లాలోని జెట్‌పురా గ్రామంలో దారుణ హత్య జరిగింది. లోకల్ బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్ (35)ను గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఠాకూర్ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య రక్తం మడుగులో పడి ఉందని, హత్య జరిగిన సమయంలో 22 ఏళ్ల ఠాకూర్ కుమార్తె కూడా ఇంట్లోనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.