శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు శివుడికి రుద్రాభిషేకం చేస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారట. శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహపీడలు, దోషాలు కూడా తొలగిపోతాయి. సోమవారం, మాస శివరాత్రి, మహా శివరాత్రి, శ్రావణమాసం, కార్తీక మాసం రోజుల్లో రుద్రాభిషేకం చేస్తే మంచిదట.