పశ్చిమ బెంగాల్లో బుధవారం బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. కోల్‌కతాలోని RG కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిని నిరసిస్తూ బీజేపీ ఈ బంద్ చేపడుతోంది. సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమబెంగాల్లో నిరంకుశ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు.