ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూకార్నర్ నోటీసులు

80చూసినవారు
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూకార్నర్ నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న JDS MP ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. డిప్లొమాటిక్ పాస్పోర్టుతో జర్మనీకి వెళ్లిన అతడి కోసం ఇంటర్ పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసినట్లు కర్ణాటక మంత్రి పరమేశ్వర వెల్లడించారు. త్వరలోనే అతడిని ఇండియాకు రప్పిస్తామన్నారు. కాగా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణను సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్