ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW గ్రూప్ ఇండియా తాజాగా తన BMW X3 కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20 ఎం స్పోర్ట్ ధర రూ.75.80 లక్షలు (ఎక్స్ షోరూం), బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డీ ఎం స్పోర్ట్ ధర రూ.77.80 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది.