కన్నబిడ్డతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు సమీపంలోని బుడంపాడు రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలు పడిఉన్న తీరు చూస్తే శనివారం అర్ధరాత్రి బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారికి రెండు సంవత్సరాలు ఆమె తల్లికి 30 ఏళ్ల వయసు ఉండవచ్చునని తెలిపారు. వారి వివరాలు తెలిసినవాళ్లు ఫోన్ నెంబర్లు 8328018787, 0863-2220753కు తెలియజేయాలని కోరారు.