పడవ బోల్తా.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు

79చూసినవారు
పడవ బోల్తా.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు
బీహార్‌లోని కతిహార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను పవన్ కుమార్ (60), సుధీర్ మండల్‌ (70) గా గుర్తించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్