బాలీవుడ్ పిలుపు.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన సామ్

1066చూసినవారు
బాలీవుడ్ పిలుపు.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన సామ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు మరోసారి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా 'ది బుల్' మూవీని తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు వినిపించగా.. ఆ స్థానంలో ఇప్పుడు సమంత పేరు వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ తర్వలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట. కాగా, ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్‌తో సామ్ బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సంబంధిత పోస్ట్