గతంలో వరి వేసుకుంటే ఉరి అని నాటి సీఎం KCR అన్నారని.. కానీ ఇప్పుడు వరి వేస్తే సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రాబోయే రోజులలో సన్నాలకు కూడా బోనస్ కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సోనా, BPT, HMT బియ్యాన్ని ఎక్కువగా తింటారని అన్నారు. రైతులు నాణ్యమైన సన్నాలు పండిస్తే, పేదలకే అందిస్తామని చెప్పారు. పథకాలు అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు, రైతులకు తెలియాలన్నారు.