జాతీయ మహిళా కమిషన్ సభ్యత్వ పదవికి ఖుష్బూ రాజీనామా

59చూసినవారు
జాతీయ మహిళా కమిషన్ సభ్యత్వ పదవికి ఖుష్బూ రాజీనామా
బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి ఖుష్బూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యత్వ పదవికి ఆమె రాజీనామా చేశారు. తన ఎక్స్ (ట్విటర్) బయోలో సైతం మహిళా కమిషన్‌లో సభ్యురాలనే విషయాన్ని ఆమె తొలగించారు. జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా ఏడాదిన్నర పాటు ఆమె సేవలు అందించారు. పదవికి రాజీనామా లేఖను ఆమె జులైలోనే సమర్పించారు. దానిని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్