ఉల్లి ధరలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని పేర్కొంది. అయితే, కనీస ఎగుమతి ధరను టన్నుకు 550 డాలర్లుగా (రూ.45,860) పేర్కొంది. మహారాష్ట్రలో తదుపరి దశ పోలింగ్ జరగనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.