లాల్ సలామ్.. JNUలో ఏచూరి పార్థివ దేహానికి ఘన నివాళి (వీడియో)

588చూసినవారు
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) పార్థివ దేహానికి జేఎన్‌యూలో విద్యార్థులు శుక్రవారం ఘన నివాళి అర్పించారు. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ఆఫీసు వద్ద ఆయన పార్థివ దేహాన్ని కొద్ది సేపు ఉంచారు. ఆ సమయంలో కమ్యూనిస్టు యోధుడికి లాల్ సలామ్ అంటూ విద్యార్థులు చివరి వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఎయిమ్స్‌లో ఆయన పార్థివ దేహానికి సీపీఎం నేతలు ఎర్ర జెండా కప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్