హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో గురువారం కాల్పులు కలకలం సృష్టించింది. కర్ణాటక బీదర్‌లో ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్‌పై దొంగల ముఠా కాల్పులు జరిపారు. దొంగల ముఠాని పట్టుకొవడానికి పోలీసులు కర్ణాటక నుండి హైదరాబాద్ వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకొని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్‌పై దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.