BREAKING: కిషన్రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత

56చూసినవారు
BREAKING: కిషన్రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నీట్ సమస్యపై ఐక్య యువజన విద్యార్థి సంఘం నేతలు కిషన్రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. నీట్ పేపర్ లీకేజ్, అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరకు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్