వయస్సుకు అంకెలతో పని లేదని ప్రపంచ ప్రఖ్యాత గిటారిస్టు, గ్రామీ అవార్డు గ్రహీత బ్రయాన్ అడమ్స్ నిరూపించాడు. తన గిటార్ ప్రదర్శనతో సంగీత అభిమానులకు వింటర్‌లోనే వేడి పుట్టించాడు. ఇప్పటివరకు బ్రయాన్ ఇండియాలో ఆరు ప్రదర్శనలను ఇచ్చాడు. 1993, 2001, 2006, 2011, 2018, 2024లో (డిసెంబర్ 8)న కోల్‌కతాలో తన గిటార్ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.