ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.11,467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం పిలవనుంది. ఈ మేరకు జీవో 968ను ప్రభుత్వం జారీ చేసింది.