TG: మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ మాట్లాడుతూ.. 20-30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని వారి ఎమ్మెల్యేలే చెబుతున్నారంటూ శాసనసభలో అన్నారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.