ఒరిస్సాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలేజీ ముగించుకుని ఓ బాలిక బస్సు కోసం బస్టాండ్ వద్ద వెయిట్ చేస్తోంది. కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆమెను ఇంటి దగ్గర దించుతామని మాయ మాటలు చెప్పారు. వారి మాటలు విన్న బాలిక కారులో ఎక్కింది. కారును దగ్గరలోని పెట్రోల్ బంకు వద్దకు తీసుకెళ్లిన నిందితులు.. బాలికను పెట్రోల్ బంక్ టాయిలెట్ లోకి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.