'పేదల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉండకూడదని అన్నప్పుడు.. మరి కమర్షియల్ కాంప్లెక్సులు, ఐటీ టవర్స్ ఉండొచ్చా? వాటికి బఫర్‌జోన్ నిబంధనలు వర్తించవా? పేదల ఇళ్లకేనా ఆ నిబంధనలు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి వెంకట్‌రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదన్నారు. ఆయన, శ్రీధర్‌బాబు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఈ ప్రాజెక్టుకు ఒప్పించాలని అన్నారు.