బ్యాంకాక్‌లో భూప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 90 మంది గల్లంతైనట్లు థాయిలాండ్ రక్షణ మంత్రి ప్రకటించారు. దీంతో టూరిస్టులు ఎయిర్‌పోర్టుకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆర్మీ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.