ఛాంపియన్స్‌ ట్రోఫీ నుండి బుమ్రా ఔట్‌

54చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీ నుండి బుమ్రా ఔట్‌
మరో వారం రోజుల్లో మొదలయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీకి గాయాల బెడద తప్పడం లేదు. ట్రోఫీలో టైటిల్ హాట్ ఫేవరేట్‌ అయిన టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో గాయపడ్డ బుమ్రా, ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో టోర్నీకి దూరమయ్యాడని బీసీసీఐ ‘X’లో పోస్టు పెట్టింది. బుమ్రా స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు కూడా బోర్డు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్