ప్రముఖ నటి ఇంట్లో చోరీ

54చూసినవారు
ప్రముఖ నటి ఇంట్లో చోరీ
ప్రముఖ మరాఠీ నటి శ్వేతా షిండే ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నటి ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారాలో తల్లితో కలిసి నివాసముంటోంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. ఆ సమయంలో శ్వేత ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామంటూ పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్