యూపీలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఫతేహాబాద్ వద్ద బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అయితే ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు బకెట్లు, డ్రమ్ములతో ఆయిల్‌ను ఎత్తుకెళ్లేందుకు పరుగులు తీశారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టినా.. వెళ్లకుండా ఆయిల్ కోసం ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీలతో స్థానికులకు బుద్ధిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.