అనుమానాస్పద స్థితిలో మహిళ దహనమైన ఘటన యూపీలో జరిగింది. ఫరూఖాబాద్‌లోని ఇందిరా నగర్‌లో 62 ఏళ్ల మహిళ నిద్రిస్తుండగా అనుమానాస్పదంగా మంటల్లో చిక్కుకుని దహనమైంది. ఆమె కుమారుడు పక్క గదిలో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ అవశేషాలను సేకరించి పోస్ట్‌మార్టం కోసం పంపారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.