బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

67చూసినవారు
బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధరియావాడ్ సబ్ డివిజన్‌లో శనివారం బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దాదాపు బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్