జాతీయ రహదారులపై బైకర్లు చేసే చిన్నచిన్న తప్పులే భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వెనుక నుంచి వచ్చే వాహనాల రాకపోకలను గమనించకుండా ఓ బైకర్ ముందుకు వెళ్లడంతో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని లాథూర్ హైవేపై బైకును తప్పించే క్రమంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.