శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రాజస్థాన్ కాంగ్రెస్ ఎంపీ ఉమ్మెద్రమ్ బెనివాల్ పీఏకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ నెల 12న ఎంపీతో సహా ఆయన పీఏ న్యూఢిల్లీ నుంచి జైపూర్‌కు ట్రైన్‌లో వెళ్తున్నారు. ట్రైన్ ఆగిన వెంటనే ఓ దొంగ లోపలికి వచ్చాడు. ఎంపీ పీఏ ఫోన్‌ను లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. దొంగను పట్టుకునేందుకు ఇద్దరు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.