TG: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అరాచకాలపై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు.