ఈ ఎంపీ అభ్య‌ర్థులు ట్రాఫిక్ చ‌లాన్లు కూడా చెల్లించ‌లేరా..?

56చూసినవారు
ఈ ఎంపీ అభ్య‌ర్థులు ట్రాఫిక్ చ‌లాన్లు కూడా చెల్లించ‌లేరా..?
సామాన్యులే కాకుండా ప్రజలకు మంచి చెడులు చెప్పే రాజకీయ నాయకులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తాజాగా చర్చానీయాంశంగా మారింది. ఈ లిస్టులో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టీ పద్మారావు, నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ చలాన్ పెండింగ్‌లో ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్