ప్రతి రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరానికి నూతన శక్తి లభించి చురుకుగా మారుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. కీళ్ల సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. రక్తపోటు తగ్గి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.