ఐపీఎల్‌లో హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ సమర్థించారు. సరైన కారణం లేకుండా హ్యరీ బ్రూక్ ఐపీఎల్‌ను వీడినందువల్లే బీసీసీఐ ఈ నిషేధం విధించింది అని మైఖేల్ వాన్ పేర్కొన్నారు. IPL మెగా వేలంలో బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు DC కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ జాతీయ జట్టు కమిట్మెంట్ కోసం బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.