యూపీలోని బిజ్నోర్‌లో బైక్‌పై రీల్స్ చేస్తున్న ఇద్దరు యువకులు ఘోర ప్రమాదానికి గురయ్యారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైైక్‌ను ఢీకొనడంతో గాల్లోకి ఎగిరిపడ్డారు. జాతీయ రహదారి 34పై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. బాధితులు ముధాల గ్రామానికి చెందిన సమర్, నోమన్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.