యాలకులను ప్రతిరోజు పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. యాలకులు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో ఏలకులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని సూచిస్తున్నారు.