బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

68చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగౌడ వద్ద నిలిపి బాణసంచా కాల్చారని, ర్యాలీ ఆపి ప్రసంగిస్తూ భక్తులు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినట్టు పేర్కొన్నారు. రాజాసింగ్ తో పాటు జోగేందర్ సింగ్ బిట్టుపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్